ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాల్దీవుల రాజధాని మాలేలోని రిపబ్లిక్ స్క్వేర్‌లో మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఆ దేశానికి రెండ్రోజుల పర్యటనలో భాగంగా వెళ్లిన ప్రధాని మోదీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో కలిసి మోదీ తిలకించారు.