ప్రిన్సెస్ డయానా ధరించిన ప్రసిద్ధ ‘రివెంజ్ డ్రెస్’ వేలానికి రానుంది. కింగ్ చార్లెస్-3 తన వివాహేతర బంధాన్ని బహిరంగంగా వెల్లడించిన రోజున డయానా ఈ దుస్తులు ధరించడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ డ్రెస్‌కు వేలంలో 3 లక్షల డాలర్ల వరకు ధర పలికే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.