
కరూర్ తొక్కిసలాట ఘటన.. విజయ్ పార్టీ ఆఫీస్‌కు CBI
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన సీబీఐ, నేడు టీవీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. అక్కడ దాదాపు గంట సేపు ఉన్న సీబీఐ టీమ్, ఘటనకు సంబంధించి కీలక వివరాలు కోరింది. టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను సీబీఐ అధికారులు అడిగారని, వాటిని మూడు నాలుగు రోజుల్లో సమర్పిస్తామని సీబీఐకి చెప్పామన్నారు.




