జైల్లో ప్రేమలో పడిన ఖైదీలు.. పెళ్లికి కోర్టు అనుమతి

17చూసినవారు
జైల్లో ప్రేమలో పడిన ఖైదీలు.. పెళ్లికి కోర్టు అనుమతి
జైల్లో ఇద్దరు ఖైదీలు ప్రేమించుకోగా వారి పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. నాగౌర్ జిల్లాకు చెందిన మూలారామ్‌‌కు ఓ యువకుడి హత్యకేసులో జీవితఖైదు పడింది. జోధ్పూర్‌లోని గంటాఘర్ ప్రాంతానికి చెందిన సీమా ఘడ్సే ఇష్టం లేని పెళ్లి కారణంగా భర్తను చంపిన కేసులో జీవితఖైదుగా ఉంది. ఈ క్రమంలో జైలులో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం సీమా 40 రోజుల పెరోలుపై బయట ఉండగా.. మూలారామ్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించి పెళ్లికి అనుమతి పొందారు. ఓపెన్ జైలు క్యాప్‌లో ఈ నెల 22న జరగనున్న ఈ పెళ్లికి కోర్టు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్