పూణెలో రంజీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఔటైన తర్వాత ముంబై బౌలర్ ముషీర్ ఖాన్‌పైకి బ్యాట్‌తో దూసుకెళ్లడంతో మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. అంపైర్లు, ఆటగాళ్లు జోక్యం చేసుకుని గొడవ ఆపారు. ముంబై నుంచి పూణె జట్టుకు మారిన షాకు, పాత సహచరులతో విబేధాలే ఈ ఘర్షణకు కారణమని సమాచారం. ఈ ఘటనపై క్రికెట్ అసోసియేషన్లు స్పందించలేదు.