ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబా
ద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ తన కుటుంబంతో కలిసి వెళ్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని గట్టిగా హెచ్చరించాడు. 'నేను చెప్పేది జాగ్రత్తగా
విను.. రికార్డు చేయొద్దు' అని క్లాసెన్ పేర్కొన్నాడు. ఒకవేళ తనను, తన కుటుంబాన్ని ఫోటో తీస్తే ఊహించని విధంగా బుద్ధి చెబుతానని, దాని నుంచి కోలుకోలేవని హెచ్చరించాడు. ఈ వీడియోపై నెటిజన్లు 'అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!' అని మాస్ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.