
ఐదేళ్లు విధ్వంసపు పాలన చేశారు: చంద్రబాబు
AP: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, అవినీతిమయమైన పాలనను మార్చి కూటమి హయాంలో సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని విభాగాలను గాడిలో పెడుతున్నామని, ప్రజలు ఇచ్చిన గెలుపు తమకు సంజీవనిలా పనిచేస్తోందని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా పొన్నపువారిపాలెంలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ తర్వాత నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.




