AP: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అడ్డరోడ్డు జంక్షన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంతో బస్సు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.