TG: చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.