TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ప్రైవేట్ కళాశాలలు బంద్ చేపట్టాయి. ఈరోజు నుంచి జరగనున్న పరీక్షలన్నింటినీ బహిష్కరిస్తున్నట్లు యాజమాన్య సంఘం ప్రకటించింది. మొత్తం బకాయిల్లో రూ.5 వేల కోట్లు చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ తెలిపారు. ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.