తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్!

38చూసినవారు
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల బంద్!
TG: కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నవంబర్ 2 తేదీ వరకు చెల్లించక పోతే 03వ తేదీ నుంచి నిరవదిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమాఖ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విద్యా సంస్థలపై తనిఖీలు చేయాలని అధికారులను రేవంత్ సర్కార్ ఆదేశించడం గమనార్హం.

సంబంధిత పోస్ట్