తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి తామరై సెల్వన్ (27) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బైకును ఢీకొట్టి, అనంతరం వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. ప్రాణభయంతో పోలీసు క్వార్టర్స్‌లోని ఏఎస్‌ఐ సెల్వరాజ్ ఇంట్లోకి వెళ్లి సెల్వన్ దాక్కున్నాడు. దుండగులు అక్కడికి చొరబడి ఏఎస్ఐ కుటుంబ సభ్యులు చూస్తుండగా నరికి చంపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.