TG: సూర్యాపేట(D) చివ్వేంల(M) పరిధిలోని ఉండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో గల ఓ ప్రైవేట్ పాఠశాల సిబ్బంది సోమవారం ఓ విద్యార్థి తండ్రి పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్న ఆటోలో 25 మంది విద్యార్థులను తీసుకెళ్తుండడం పై స్కూల్ సిబ్బందిని విద్యార్థి తండ్రి ప్రశ్నించగా, ఆగ్రహానికి గురైన సిబ్బంది ఇనుప రాడ్‌తో ఆయనపై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.