అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (వీడియో)

35చూసినవారు
TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్