TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న గౌతమ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.