హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడిరోడ్డుపై ప్రయాణికులను వదిలేసి పరారైన ఘటన కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం సమీపంలో బస్సులో డీజిల్ అయిపోయిందని చెప్పిన డ్రైవర్, ప్రయాణికులను రోడ్డుపై దిగబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సు సిబ్బందికి కాల్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రావెల్స్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా స్పందించలేదని బాధితులు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు.