ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం (వీడియో)

27చూసినవారు
TG: నల్గొండ జిల్లా పెదకాపర్తి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న రైన్‌బో ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపారు. బస్సులో వేగంగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్