నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’లో ఎమ్మెల్యే శంకరన్నగా ప్రియదర్శి ఆకట్టుకున్నారు. కేసీఆర్‌ను తలపించేలా ఆయన ఆహార్యం, హావభావాలు, మాటతీరు ఉండటంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రియదర్శిని కలిసిన ఓ మహిళా అభిమాని.. ‘కేసీఆర్‌లా అద్భుతంగా చేశారు’ అంటూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ప్రియదర్శిని పట్టుకుని ఎమోషనల్ అయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు హరీశ్‌రావు కూడా ప్రియదర్శిని కలిసి అభినందించారు.