
విక్టరీ వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరా' రీ-రిలీజ్ వాయిదా
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా 'ప్రేమంటే ఇదేరా' సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే డిసెంబర్ 13న కాకుండా ఈ సినిమా రీ-రిలీజ్ వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. 'అఖండ-2' వాయిదా, చిన్న సినిమాల విడుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1998లో విడుదలైన ఈ చిత్రానికి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు.




