దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన ఆమె, రాజకీయాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.