AP: తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ప్రియాంకను కారుతో ఢీకొట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు నిందితులను ప్రశ్నించి, కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.