TG: ప్రభుత్వం వడ్లు కొనకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులకు సమాధానం చెప్పలేక నల్గొండ జిల్లా మార్తినేనిగూడెం, బచ్చన్నగూడెం వడ్ల కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మిల్లర్స్, అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతడిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.