రాజమండ్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ సినీ నిర్మాతల బృందం భేటీ విజయవంతంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు థియేటర్ల కేటాయింపులు, ప్రత్యేక ప్రదర్శనల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. సమావేశం అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమా థియేట్రికల్ విడుదలకు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవని అధికారికంగా తెలిపారు. సినీ రంగానికి చెందిన అన్ని వర్గాల సమస్యలను పరిశీలిస్తున్నామని, పరిశ్రమ మనుగడకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.