రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసులో భూ వివాదమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. స్వప్న అన్న రాజు, తల్లి వెంకటమ్మ పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకోవడానికి ప్రయత్నించాడు. దీనిని స్వప్న అడ్డుకోవడంతో, పొలం వద్ద సర్వే చేయిస్తున్న సమయంలో రాజు ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వప్న మృతి చెందింది. అయితే స్వప్నను హత్య చేసేందుకు రాజుకు కావలి శివలింగం, వడ్డే వీరేశ్, ఎర్రోళ్ల సందీప్ సహకరించినట్లు సమాచారం.