ప్రముఖ విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత

0చూసినవారు
ప్రముఖ విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత
ప్రముఖ విప్లవ గీతాల గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అగ్రనేత నాగన్న మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రాజారాం గ్రామానికి చెందిన నాగన్న 'అరుణోదయ నాగన్న'గా ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి తన ఆటపాటలతో విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్