రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజాసాబ్’ సినిమా నుంచి 'రెబల్ సాబ్' పాట ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రభాస్ లుక్స్, తమన్ అందించిన మ్యూజిక్, బీట్స్ అదిరిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పూర్తి పాట రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.