కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లకు త్వరలో పదోన్నతులు!

2914చూసినవారు
కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లకు త్వరలో పదోన్నతులు!
తెలంగాణ పోలీసుశాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల పదోన్నతుల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. సుమారు 15,582 మందికి ఒకేసారి పదోన్నతులు కల్పించేలా పోలీసుశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపింది. కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌, ఆపై అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల స్థాయి పదోన్నతుల నిష్పత్తిని 13-3-1 నుంచి 4-2-1కి తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ కొత్త నిష్పత్తి అమల్లోకి వస్తే తక్కువకాలంలోనే పదోన్నతులు పొందే వీలుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్