TG: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మెరుగుపరచడం, సిబ్బంది కొరతను అధిగమించడం లక్ష్యంగా ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో 36 మంది సివిల్ సర్జన్లకు పదోన్నతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం మీద.. ఒక్కరోజే 39 మంది అధికారులకు పదోన్నతులు లభించడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.