గ్రామ కంఠం స్థలాల్లో 12 ఏళ్లుగా నివాసం ఉంటే ఆస్తి హక్కులు

171చూసినవారు
గ్రామ కంఠం స్థలాల్లో 12 ఏళ్లుగా నివాసం ఉంటే ఆస్తి హక్కులు
TG: గ్రామాల్లోని ఆబాదీ (గ్రామ కంఠం) స్థలాల్లో 12 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వం ఆస్తి హక్కులు కల్పించనుంది. ఇందుకోసం 'స్వామిత్వ స్కీమ్' తరహాలో కొత్త చట్టం అమలుకు కసరత్తు చేస్తోంది. ఎలాంటి వివాదాలు లేకుండా 12 ఏళ్లుగా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపితే లీగల్ ప్రాపర్టీ కార్డులు అందజేయనుంది. వెరిఫికేషన్‌లో పన్ను రశీదు, పొరుగువారి వాంగ్మూలం కీలకంకానుంది. అభ్యంతరాలకు 21 రోజుల గడువు ఇవ్వనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్