TG: రాష్ట్రంలో కోర్ అర్బన్ ఏరియా బయట ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో ఆస్తిపన్ను వసూళ్లు పెరిగాయి. 133 పట్టణ, నగర పాలికల్లో రూ. 685 కోట్ల ఆస్తి పన్ను వచ్చాయి. WGL, కరీంనగర్, KMM, మంచిర్యాల, రామగుండం, NZB కార్పొరేషన్లలో ఆస్తిపన్ను ఆదాయం పెరగ్గా కొత్తగూడెం, MBNR, NLGలో తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా 64 స్థానిక సంస్థల్లో ఆస్తిపన్నుల వసూలు పెరిగినట్లు పురపాలక శాఖ వెల్లడించింది. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాల్టీల్లో 100 శాతం ఆస్తిపన్ను వసూలైనట్లు తెలిపింది. కొత్తగా ఏర్పడిన 21 మున్సిపాల్టీల్లో గతంతో పోలిస్తే ఆస్తిపన్ను ఆదాయం పెరిగింది.