ఎక్సైజ్ శాఖకు ఆయుధాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు

2చూసినవారు
ఎక్సైజ్ శాఖకు ఆయుధాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
TG: క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు అందించడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే పోలీసుశాఖతో కలిసి ఆయుధాలు వినియోగించాలని, ఎన్‌డీపీఎస్ డ్రగ్స్, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘా పెంచాలని ఆదేశించారు. డ్రగ్స్, అక్రమ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని, బార్లు, మద్యం షాపుల ఎక్సైజ్ రెంటల్ ఫీజును త్వరగా వసూలు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్