తాగునీటి బోరు మోటార్ కోసం ఆందోళన.. మహిళలను తోసేసిన సీఐ(వీడియో)

15368చూసినవారు
TG: మహిళలపై ఓ సీఐ దురుసుగా ప్రవర్తించిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటు చేసుకుంది. ఉత్తర్‌పల్లి గ్రామంలో తాగునీటి బోరు మోటార్ కోసం మహిళలు ఆందోళనకు దిగారు. పట్టా భూమిలో బోరు ఉందని ఇటీవల భూ యజమాని శ్రీనివాస్ అనే వ్యక్తి మోటారు తొలగించాడు. దీంతో 15 రోజులుగా తాగునీటి సమస్య ఉందని శుక్రవారం ఖాళీ బిందెలతో మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళల్ని సీఐ క్రాంతి తోసేశారు.

సంబంధిత పోస్ట్