హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన: ఓవైసీ

6చూసినవారు
హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన: ఓవైసీ
TG: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడానికి ఫారం-7 దరఖాస్తులను బీజేపీ, సంఘ్ పరివార్ దుర్వినియోగం చేస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తుల్లో తొలగించాల్సిన ఓటర్ల వివరాలు ఉంటున్నాయని, ఇది పూర్తిగా తప్పని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.  ఇలాగే కొనసాగితే జంతర్ మంతర్ కంటే పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో ఆందోళనలు జరుగుతాయని ఓవైసీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్