TG: కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆందోళనలకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.