పాకిస్థాన్‌లో ఆందోళనలు.. 9 మంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో అమెరికా రాయబారి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇరాన్ మత నాయకుడు అలీ ఖమెనీ మరణం నేపథ్యంలో ఈ నిరసనలు చెలరేగాయి. ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి. భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, ఆందోళన చేస్తున్న వారిపై నిషేధాజ్ఞలు అమలు చేశాయి.