
AP: రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు: వాతావరణ శాఖ
AP: రాష్ట్రంలో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.




