TG: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిన్నటితో ముగిసింది. మార్చి 6నుంచి ఈనెల 12వరకు 1,06,598 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 7,292 గ్రామాల్లో స్త్రీ శక్తి భవనాలు, 131 గోదాములు, 577వర్క్ షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగినట్లు పేర్కొంది. 12,758 పంచాయతీల్లో గ్రామసభలు, 3,175 మున్సిపల్ వార్డుల్లో వార్డు సభలు జరిగాయి.