
లండన్ వీధుల్లో ఇండియన్ సమోసా అమ్ముతున్న వ్యక్తి.. వీడియో వైరల్
లండన్ వీధుల్లో ఇండియన్ స్నాక్ సమోసాతో బీహారీ స్టైల్లో హడావుడి చేస్తున్నారు ఘంటావాలా బీహార్ ఫుడ్ స్టాల్ నిర్వాహకుడు. వెంబ్లీ, లండన్లో రెండు బ్రాంచ్లు ఉన్న ఈ స్టాల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వీడియోలో ఓ విదేశీయుడు కొత్త టెస్లా కారుపై కూర్చుని సమోసా తింటుండగా, నిర్వాహకుడు వీధుల్లోనే సమోసా అమ్ముతున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. టీ స్టాల్స్, బస్ స్టాప్స్, పార్కుల్లో సంప్రదాయ బీహారీ శైలిలో సమోసా అమ్ముతూ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నారు.




