ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్ల కుంట పరిధిలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును, జంగిల్ సఫారీ, బోటింగ్‌లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. కనకగిరి గుట్టల్లోని ప్రకృతి ఒడిలోని పులిగుండాల ప్రదేశాలను సందర్శించిన మంత్రులు, ఎకో టూరిజంలో రాష్ట్రంలోనే టాప్ 3లో నిలిచేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.