కెనడాలో యువతి హత్య.. భారత్‌కు పరారైన అనుమానితుడు

22166చూసినవారు
కెనడాలో యువతి హత్య.. భారత్‌కు పరారైన అనుమానితుడు
కెనడాలోని టొరంటోలో పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల అమన్‌ప్రీత్ సైనీ దారుణ హత్యకు గురైంది. లింకన్ ప్రాంతంలోని పార్కులో ఆమె మృతదేహం తీవ్ర గాయాలతో లభ్యమైంది. ఈ కేసులో అనుమానితుడిగా గుర్తించిన భారతీయ యువకుడు మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటికే కెనడా నుంచి భారత్‌కు పారిపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కెనడా అధికారులు నిందితుడి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.