ఫ్రాన్స్‌ నుంచి మరో 114 యుద్ధ విమానాల కొనుగోలు

1713చూసినవారు
ఫ్రాన్స్‌ నుంచి మరో 114 యుద్ధ విమానాల కొనుగోలు
భారత రక్షణశాఖ వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు ఫ్రాన్స్ నుంచి మరో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అధికారిక ప్రతిపాదన లేఖను సిద్ధం చేసింది. ఈ లేఖను త్వరలోనే ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు 90 విమానాలను ‘మేకిన్ ఇండియా’ కింద దేశంలోనే తయారు చేయనున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్, ఒక భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి వీటిని ఉత్పత్తి చేస్తుంది. మిగిలినవి నేరుగా ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతాయి.

సంబంధిత పోస్ట్