ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కీలక బ్యూఫోర్ట్ కోటను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం
May 31, 2026, 10:05 IST/

కీలక బ్యూఫోర్ట్ కోటను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం

May 31, 2026, 10:05 IST
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దక్షిణ లెబనాన్‌పై పట్టు సాధించే క్రమంలో భాగంగా చారిత్రాత్మక, వ్యూహాత్మక 'బ్యూఫోర్ట్ క్యాజిల్‌' (కోట)ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 'గోలానీ బ్రిగేడ్‌' సైనిక దళాలు శత్రువులతో పోరాడి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. 1982లో జరిగిన మొదటి లెబనాన్ యుద్ధంలోనూ ఇదే దళాలు ఈ కోటను ఆక్రమించాయి. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈ ఎదురుదాడి చేపట్టింది. ఈ కోట ఇరు దేశాల రక్షణ వ్యవస్థలకు అత్యంత కీలకం, నిఘా ఉంచడానికి వ్యూహాత్మక స్థావరం.