
బాలయ్య 'అఖండ 2'కు ఆ చిత్రం నుంచి గట్టి పోటీ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ 2 తాండవం' చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'వా వాతియార్' కూడా విడుదల కానుంది. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ ఉండటంతో ఈ చిత్రం 'అఖండ 2'కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ చిత్రంలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా, కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య, కార్తీల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది.




