అంతర్జాతీయ వేదికలపై భారతీయ చలన చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్‌పై మన మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించారు. 'పుష్ప 2: ది రూల్' చిత్రం జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్' సినిమా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సుకుమార్ 'పుష్ప 2' కథ జపాన్ హార్బర్ సీన్‌తో మొదలవుతుందని, పుష్ప జపాన్ ఎందుకు వెళ్లాడనే సస్పెన్స్‌ను 'పుష్ప 3'లో చూపించనున్నట్లు తెలిపారు.