
‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు
'అఖండ-2' విడుదలకు సిద్ధమవుతున్న వేళ మూవీ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 'అఖండ-2' నిర్మాణ సంస్థ 14 రీల్స్ (ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు సినిమాను విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందించాల్సి ఉంది.




