
ఆ దగ్గుమందులో కలుషిత ఆనవాళ్లు లేవు.. కానీ..
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ ఇవ్వడంతో 11మంది పిల్లలు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. జైపూర్‌కి చెందిన కేసన్స్ కంపెనీ తయారు చేసిన ఈ సిరప్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు తాము నిర్వహించిన పరీక్షల్లో పిల్లలకు ఇచ్చిన దగ్గుమందులో ఎటువంటి కలుషిత ఆనవాళ్లు లేవని ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లుగా ఈ సిరప్‌కు చేసిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమయినట్లు గుర్తించిన అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు.




