రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ (47)పై విషప్రయోగం జరిగిందని ఆయన భార్య యూలియా నావల్నాయ సంచలన ఆరోపణలు చేశారు. నావల్నీ భౌతికకాయం నుంచి సేకరించిన నమూనాలను రెండు దేశాల ల్యాబ్‌లు పరీక్షించగా విషప్రయోగం జరిగినట్లు తేలిందని, కానీ రాజకీయ కారణాలతో నివేదికలు దాచిపెట్టారని ఆమె ఎక్స్‌లో వీడియోలో తెలిపారు. 2024 ఫిబ్రవరిలో జైలులో నావల్నీ అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే.