
ఆంధ్రలో నాలుగు రక్షణాయుధాల తయారీ కేంద్రాలు
రానున్న కాలంలో దేశంలో ఏపీకి ప్రత్యేక స్తానం దక్కబోతోంది. ఇక్కడ నాలుగు రక్షణాయుధాల తయారీ కేంద్రాలను ప్రారంభించనున్నారు. మడకశిరలో గ్రెనేడ్లు, ఆర్టిలరీ షెల్స్, దొనకొండలో ఆయుధాలు, ఇంధనాలు, అనకాపల్లిలో జలాంతర్గత యుద్ధ పరికరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రత్యేక ఆయుధ తయారీ కేంద్రాలు రానున్నాయి. వీటి రాకతో ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. అలాగే ఏపీ అతిపెద్ద రక్షణాయుధాల తయారీ హబ్‌గా మారనుంది.




