రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా, రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అధునాతన S-500 ప్రోమేతియస్ క్షిపణి వ్యవస్థపై చర్చలు జరగనున్నాయి. S-500 కేవలం S-400కు అప్‌గ్రేడ్ వెర్షన్ మాత్రమే కాకుండా.. దీని సామర్థ్యాలు, ఉన్నతమైన ఆయుధ వ్యవస్థగా ఉంది. S-500 సుమారు 500-600 కి.మీ వరకూ లక్ష్యాలను ఛేధించగలదు.