ఉక్రెయిన్‌లోకి సైన్యం పంపితే.. యూరప్‌కు పుతిన్ వార్నింగ్ (వీడియో)

9027చూసినవారు
ఉక్రెయిన్‌కు యూరోపియన్ దళాలను పంపడం అంటే.. రష్యాతో నేరుగా యుద్ధానికి దిగడమేనని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. యూరోపియన్‌ నేతలు తమ దేశాలను రష్యాతో యుద్ధం వైపు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తర్వాత.. అక్కడ భద్రత కోసం యూరప్‌ దేశాలు సైన్యాన్ని పంపే ఆలోచనలో ఉన్నాయి. యుద్ధం పూర్తిగా ముగిశాకే సైన్యాన్ని పంపుతామని యూరప్‌ దేశాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యూరప్‌ సైనికులు ఎవరూ ఉక్రెయిన్‌లో లేరని స్పష్టం చేశాయి.

సంబంధిత పోస్ట్